HomeTelugu Trendingపది భాషల్లో సూర్య మూవీ.. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఎప్పుడంటే!

పది భాషల్లో సూర్య మూవీ.. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఎప్పుడంటే!

surya and shiva movie title

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య విభిన్న పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలలో చాలానే ప్రయోగాలు కనిపిస్తాయి. ఈక్రమంలో సూర్య 42వ సినిమా రెడీ అవుతున్నాడు. శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఫిక్స్‌ చేయలేదు.

ఈ సినిమా కథాకథనాలు విభిన్నంగా ఉండనున్నాయి. దీంతో ఈ మూవీ టైటిల్‌పై ఆసక్తినెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 9:05 నిమిషాలకు టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

అడవీ ప్రాంతంలో విల్లంబులు ధరించి గుర్రాలపై వేటాడే ఒక వేటగాడు, ఆ గుర్రంపై ఒక కొండ కొస నుంచి మరో కొండపైకి జంప్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. పక్కనే ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వేటకుక్క కూడా కనిపిస్తోంది. ఈ సినిమాలో నయనతార, దిశా పటాని హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పది భాషల్లో విడుదల చేయనున్నారు.

20230411fr6435602264aa6

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu