HomeTelugu Trendingప్లాట్‌కోసం 4.5 కోట్లు ఈఎంఐ చెల్లించిన సుశాంత్

ప్లాట్‌కోసం 4.5 కోట్లు ఈఎంఐ చెల్లించిన సుశాంత్

Sushant singh rajput payingబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రోజు రోజుకూ ఆసక్తి కర విషయాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ బ్యాంక్ అకౌంట్‌ నుంచి రూ. 15 కోట్లు మాయమైనట్లు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో సుశాంత్ ప్రియురాలు రియాచక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.సుశాంత్ బ్యాంక్ అకౌంట్‌ నుంచి రూ. 4.5 కోట్లు ఓ ప్లాట్‌ ఈఎమ్‌ఐ కోసం చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ అధికారుల విచారణలో రియా ఈ ఫ్లాట్
గురించి తెలిపింది. ఆ ముంబైలోని మలాడ్‌లో ఉన్న ఈ ప్లాట్‌లో ప్రస్తుతం సుశాంత్‌ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఉంటున్నారు. ఈ ప్లాట్‌కు సంబంధించి సుశాంత్‌ రూ. 4.5 కోట్లను ఈఎమ్‌ఐల రూపంలో చెల్లించినట్లు తెలిసింది. సుశాంత్‌ అంకిత కోసం ఈఎమ్‌ఐలు చెల్లించాడని, వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అతడు అంకితను ప్లాట్‌ ఖాళీ చేయమని కోరలేదని రియా తెలిపింది. గత కొద్ది నెలలుగా ఈఎమ్‌ఐలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!