
నేడు (జూన్ 21) “ఫాదర్స్ డే” సందర్భంగా సుష్మిత కొణిదెల ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బార్బర్ అవతారం ఎత్తింది. అది కూడా తన తండ్రి కోసం. ఓ చేతిలో కత్తెర, మరో చేతిలో దువ్వెన పట్టుకుని మెగాస్టార్ చిరంజీవికి క్షవరం చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే చివర్లో మెగాస్టార్ లుక్ మాత్రం చూపించలేదు. మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన పాతఫోటోను జతచేసి ‘మా నాన్నతో చిరుత’ అంటూ ఫాదర్ డే
శుభాకాంక్షలు తెలిపారు.













