HomeTelugu Trendingటాలీవుడ్‌లో స్వాతి రీ ఎంట్రీ

టాలీవుడ్‌లో స్వాతి రీ ఎంట్రీ

Swathi re entry with panch

‘కలర్స్’ స్వాతి తెలుగులో పలు సినిమాలు చేసి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. అయితే, 2018లో పైలట్ వికాస్ వాసును పెళ్లి చేసుకున్న స్వాతి.. ఆ తర్వాత తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయింది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్ళీ ‘పంచతంత్రం’ తో తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ‘పంచతంత్రం’ సినిమాలో స్వాతి కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డెబ్యూ డైరెక్టర్ హర్ష పులిపాక తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ఇతర పాత్రలలో కనిపించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!