పెళ్లిపై తాప్సీ స్పందన


టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. బాలీవుడ్‌లో స్థిరపడిన బ్యూటీ తాప్సీ. బాలీవుడ్‌ పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మ్యాథ్యూస్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేగాక‌, త్వ‌ర‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై తాప్సీ స్పందించింది. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే అవ‌కాశం లేద‌ని చెప్పింది.

అలాగే, సినీ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టంలేదని తెలిపింది. మ‌నం రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం అనేవి వేర్వేరుగా ఉండాలని ఆమె అభిప్రాయపడింది. ఇక మ్యాథ్యూస్ గురించి చెబుతూ, అతను త‌నకు బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడు అని చెప్పింది. తాను సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉన్నాన‌ని తెలిపింది. ఏడాదికి ఆరు సినిమాల్లో నటిస్తున్నానని, ఆ సంఖ్య రెండు లేక‌ మూడుకు తగ్గినపుడే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

CLICK HERE!! For the aha Latest Updates