‘ఠాగూర్‌’ తరహా కథతో మరోసారి చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి, ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాగా చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరి సినిమా సెట్స్‌ మీదకు వెళ్లబోతోందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం కొరటాల ‘ఠాగూర్‌’ తరహా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భావోద్వేగపు అంశాలతో పాటు, మంచి సందేశాత్మకమైన సినిమాను చిరుతో తీయాలని కొరటాల భావిస్తున్నారట. పదిహేనేళ్ల క్రితం విడుదలైన ‘ఠాగూర్’ చిత్రం చిరు కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే కొరటాల తీయబోయే సినిమాను రామ్‌చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే అవకాశం ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates