తమన్నాపై నేనెందుకు ఫిర్యాదు చేస్తానంటున్నారు!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న తమన్నాకు ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. సినిమాకు
సంబంధించిన ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో అయినా.. అమ్మడు చురుగ్గా పాల్గొంటుంటుంది. దీంతో ఆమె దర్శక నిర్మాతల హీరోయిన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే సడెన్ గా ఈ మిల్కీబ్యూటీ తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేదని నిర్మాత ఆర్.కె.సురేష్ తనపై కేసు పెట్టినట్లుగా నిన్న వార్తలు గుప్పుమన్నాయి. తమన్నా హీరోయిన్ గా తమిళంలో ‘ధర్మధురై’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్ అవ్వడం, హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం జరిగిపోయాయి. కానీ ‘అభినేత్రి’ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న తమన్నా తన సినిమా ప్రమోషన్స్ కు మాత్రం సరిగ్గా రాలేదని నిర్మాత ఆవేదన చెంది తమిళ నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేశారనేది ఆ వార్తల సారాంశం. దీంతో ఉలిక్కిపడ్డ నిర్మాత అసలు తను తమన్నాపై ఎటువంటి కేసు పెట్టలేదని మీడియా ముందుకు వచ్చి తెలిపారు. తమన్నా నాకు ఇష్టమైన నటి.. నా సినిమా కథ వినగానే ఒప్పుకొని నటించారు.. బాహుబలి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ నా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.. అటువంటి ఆమెపై నేనెందుకు పిర్యాధు చేస్తానని వెల్లడించారు. మరి ఇకనైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!
CLICK HERE!! For the aha Latest Updates