HomeTelugu Trendingమరో ఐటెం సాంగ్‌లో తమన్నా

మరో ఐటెం సాంగ్‌లో తమన్నా

3 28అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. మహేష్ బాబు ఇందులో ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నారు. మహేష్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో మహేష్‌తో కలిసి తమన్నా స్టెప్పులేయబోతుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి ఫోన్ చేయగానే తమన్నా ఓకే చెప్పిందట. తనకు స్పెషల్ స్టెప్స్ వేయడమంటే చాలా ఇష్టమని, అంతే కాకుండా ఎఫ్-2 వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంటుందని చెప్పింది. గతంలో మహేష్‌తో కలిసి ఆగడు సినిమా చేసింది. ఆ సినిమా నిరాశపరచడంతో మరో సినిమాలో కలిసి నటించలేదు. కానీ స్పెషల్ సాంగ్ లో కలిసి నటించబోతున్నందుకు సంతోషంగా ఉందంటోంది తమన్నా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!