తమన్నా డ్రస్‌ ఖరీదు ఎంతో తెలుసా!

టాలీవుడ్‌లో 2007లో శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘హ్యాపీడేస్‌’తో గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఆ తరువాత పలు సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తుంది. తాజాగా తమన్నా నటించిన 11th అవర్ అనే వెబ్ సీరీస్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

తాజాగా తమన్నా ధరించిన డ్రెస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా ఈ మిల్కీబ్యూటీ.. లేత గులాబీ రంగులోని పర్పుల పువ్వుల ఫ్రాక్‏లో అందంగా ముస్తాబైంది. ఆ డ్రెస్‌లో ఉన్న ఫొటోలని, వీడియో ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతే ఇక నెటిజన్ల చూపులన్నీ ఆ డ్రెస్‌ మీదే పడ్డాయి. ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. వారెవ్వా తమన్నా.. ఆ డ్రెస్ మా సొంతమైతే ఎంత బాగుంటుందని తెగ ఫీలైపోతున్నారు. ఎందుకంటే అది సాదాసీదా గౌన్‌ కాదండోయ్. అత్యంత ఖరీదైన ప్రాక్‌. దీని ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్. ఆ ఫ్రాక్ ధర అక్షరాల 51,244 రూపాయలట. దీనిని ప్రముఖ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ రూపొందించింది. ప్రస్తుతం తమన్నా ధరించిన డ్రెస్ ఖరీదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‏గా మారింది.

CLICK HERE!! For the aha Latest Updates