నిర్మాత కానున్న దర్శకుడు!

ఈ మధ్య కాలంలో చిత్ర దర్శకులు కూడా సొంతంగా బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. తెలుగులో అగ్ర దర్శకులు సుకుమార్, పూరి జగన్నాథ్ లు కూడా ఇలానే సొంత బ్యానర్లు స్థాపించి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మిగతా దర్శకులు కూడా వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్ కూడా సినిమా నిర్మాణంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నాడు.
సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అందులో ఇతర దర్శకులతో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. కొత్త వారికి అవకాశాలు ఇస్తూ పరిమిత బడ్జెట్ లో సినిమాలు నిర్మించాలనేది హరీష్ శంకర్ ప్లాన్. నిర్మాణంతో పాటు రైటింగ్ లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉండబోతోంది. కొత్త దర్శకుకులకు తన సూచనలు ఎలాగో ఉంటాయి. ఇది వర్కవుట్ అయితే గనుక లాభాలు దండుకోవచ్చు. మరి హరీష్ నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో.. చూడాలి!