
Vishal Marriage:
విశాల్ పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ హీరో ఒక హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమయ్యారు అనే వార్త తమిళ మీడియాలో బలంగా వినిపిస్తోంది.
Vishal Wedding
తాజా సమాచారం ప్రకారం, ‘కబాలి’ సినిమాలో నటించిన నటి సాయి ధన్షికను విషాల్ పెళ్లి చేసుకోనున్నారని చెబుతున్నారు.గత కొంతకాలంగా విషాల్, సాయి ధన్షిక మధ్య సన్నిహిత అనుబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ బంధం ఇప్పుడు ప్రేమగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి, అయితే అధికారికంగా ఎవ్వరూ ఇంకా ధృవీకరించలేదు. విషాల్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో “నడిగర్ సంఘం భవనం పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటాను” అని స్పష్టంగా చెప్పారు.
View this post on Instagram
ఇప్పుడు ఆ భవనం నిర్మాణం చివరి దశలో ఉండటంతో, జర్నలిస్టులు మళ్లీ ఈ విషయం ప్రస్తావించగా, “ఒకరి మీద ప్రేమ పెరిగింది, త్వరలో వివరాలు ప్రకటిస్తాను” అని ఆయన పేర్కొన్నారు.
సాయి ధన్షిక నటించిన “యోగీ దా” అనే చిత్రానికి విషాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వార్తలున్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం, వీరి నిశ్చితార్థం త్వరలో జరగనుండగా, నాలుగు నెలల తరువాత పెళ్లి ఉంటుందన్న తెలుస్తోంది.
ఇటీవల విషాల్ తమిళనాడులో జరిగిన మిస్ కూవగాం బ్యూటీ కాంటెస్ట్‌కి హాజరై అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తీసుకోకుండా జ్యూస్ మాత్రమే తీసుకోవడం వల్ల ఆయన గ్లూకోజ్ లెవల్స్ తగ్గి అస్వస్థతకు గురయ్యారని ఆయన బృందం అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ALSO READ: Subham OTT షాక్: జీ డీల్ క్యాన్సల్ అవుతుందా?