తమిళ హీరోయిన్ సూసైడ్

తమిళ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు సంపాదించుకుంటున్న హీరోయిన్ రియమిక్క బుధవారం వలసరవాక్కంలోని తన నివాసంలో ఉరివేసుకునిఆత్మహత్య చేసుకుంది. గత నాలుగు నెలలుగా వలసరవాక్కంలోని ఒక అద్దె ఇంట్లో సోదరుడు ప్రకాష్ తో కలిసి ఉంటోంది రియా. బుధవారం ప్రకాష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రియా లిఫ్ట్ చేయలేదు. దీంతో ప్రకాష్ ఇంటికి వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్నారు.