రాఖీ సావంత్ మహిళ కాదా?

బాలీవుడ్ ఐటమ్‌ బాంబ్ రాఖీ సావంత్ మహిళ కాదని, ఆమె లింగమార్పిడితో స్త్రీగా మారిందంటూ నటి తనుశ్రీ దత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై ఆరోపణల తర్వాత తనుశ్రీ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. అయితే, చాలామంది నటీమణులు తనుశ్రీకి మద్దతు తెలపగా రాఖీ సావంత్ మాత్రం వ్యతిరేకించింది.

తనుశ్రీ దత్తా స్వలింగ సంపర్కురాలని, పార్టీల్లో ఆమె డ్రగ్స్ తీసుకుంటుందంటూ రాఖీ ఆరోపణలు చేసింది. తనుశ్రీ చాలా సందర్భాల్లో తన రహస్య భాగాలను టచ్ చేసిందని, ఓ దశాబ్దం కిందట ఆమె తనపై అత్యాచారానికి పాల్పడిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తనుశ్రీ, రాఖీ సావంత్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనుశ్రీ మాట్లాడుతూ.. రాఖీ సావంత్ ట్రాన్స్‌జెండర్ (లింగమార్పిడి) అని, ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసని తెలిపింది. రాఖీ సావంత్ క్యాస్టింగ్ కౌచ్‌కు మద్దతు ఇస్తుందని, తనకు ఎవరైనా అవకాశాలిస్తే.. వారికి సహకరించేందుకు ఆమె సిద్ధమేనని గతంలో తెలిపిందని తనుశ్రీ పేర్కొంది. తనపై అనవసర ఆరోపణలు చేస్తూ తన స్థాయిని తానే తగ్గించుకుంటోందని తెలిపింది.