పెళ్లిరోజు ఫొటోలు పోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతుల పెళ్లిరోజు నేడు. వీరి వివాహం జరిగి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తారక్‌.. తన సతీమణితో కలిసి దిగిన అపురూపమైన ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘ఎనిమిదేళ్లు.. మున్ముందు మరెన్నో సంవత్సరాల కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
అభిమానుల నుంచి తారక్‌ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2011 మే5న తారక్‌, ప్రణతిల వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌.

ప్రస్తుతం తారక్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తారక్‌తో పాటు రామ్‌చరణ్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్‌ కుడి చేతికి గాయమైంది. దాంతో కొద్దిరోజుల పాటు చిత్రీకరణను నిలిపివేశారు. మరోపక్క చరణ్‌కు కూడా కాలికి గాయమైంది. ఇద్దరూ కోలుకున్నాక సినిమా చిత్రీకరణను కొనసాగిస్తారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates