Homeతెలుగు Newsఏపీలో టీడీపీకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు: చినరాజప్ప

ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు: చినరాజప్ప

ఈ రోజు (ఆదివారం) ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో ఎన్నికల పొత్తు విషయంలో అక్కడి టీడీపీ నేతలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెలంగాణలో టీఆరస్‌ను ఎదుర్కోడానికి అక్కడి నేతలు స్థానిక పరిస్థితులను బట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయం తీసుకుంటారన్నారు.

7 8

తెలంగాణలో పొత్తు విషయంపై తామిక్కడ ఏమీ మాట్లాడలేమని, తమ నేత చంద్రబాబునాయుడిదే తుది నిర్ణయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చినరాజప్ప స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ తప్పు చేశారు కాబట్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చంద్రబాబునాయుడుపై 24 కేసులు పెట్టినా ఒక్కటీ నిలబడలేదన్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఇంకా కాంగ్రెస్ పార్టీ వాసన పోలేదని, అందువల్లే అధికార పార్టీలో ఉంటూనే పోలీసు వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్నారు అని చినరాజప్ప అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu