అంబరాన్నంటిన ‘బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే’ సంబరాలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్2 ‘గ్రాండ్ ఫినాలే’ చివరి ఎపిసోడ్‌కి వచ్చేశాం. తనీష్, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి, కౌశల్‌లు ఫైనల్‌కి చేరుకోవడంతో టైటిల్ పోరు నువ్వా.. నేనా అంటూ సాగింది. ‘ఏదైనా జరగొచ్చు.. ఇంకాస్త మసాలా.. అదిరిపోయే డాన్స్‌లు.. ఆకట్టుకునే పెర్ఫామెన్స్.. బిగ్ బాస్ స్టేజ్‌‌ని షేక్ చేస్తున్న దీప్తి సునయన కిరాక్ ఫెర్ఫార్మెన్స్‌.. తేజస్విని, భాను శ్రీ, నందినిల హాట్ షో.. నేచురల్ స్టార్ స్టన్నింగ్ ఫెర్ఫార్మెన్స్‌.. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్.. ఊహించని ట్విస్ట్‌.. ఇదీ బిగ్ బాస్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌లో ఇలాంటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

113 రోజులు.. 18 మంది కంటెస్టెంట్స్.. ఎత్తులకు పైఎత్తులు.. ఎలిమినేషన్ టాస్క్‌లు.. కెప్టెన్ సమరాలు.. అదిరిపోయే అందాలు.. ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్‌లు.. అక్కడక్కడా బోరింగ్.. అంతలోనే బోలెడు కాంట్రవర్శీలు.. అందులోనే రొమాన్స్.. వీకెండ్‌లో తిట్లు, చివాట్లు, వార్నింగ్‌‌లు, హెచ్చరికలు, కొట్టుకోవడాలు, బుజ్జగించడాలు… ఇదీ బిగ్ బాస్ ప్రయాణంలో హౌస్ మేట్స్ చేదు తీపి అనుభవాలు.

‘ఏదైనా జరగొచ్చు ఇంకొంచెం మసాలా’ అంటూ నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా జూన్ 10న ఈ రియాలిటీ షోను ప్రారంభించారు. స్టార్ మాలో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు.. అలాగే సోమ, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రసారమైంది. మొదట్లో 100 రోజులు అని ప్రకటించినా.. తరువాత మరో రెండు వారాలకు పెంచారు. ఇక నేటి (సెప్టెంబర్ 30) నాటి ఫైనల్ ఎసిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..

బిగ్‌బాస్‌ ఫినాల్‌ ఎపిసోడ్‌ లో బిగ్‌బాస్‌ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ పార్టీ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నాని బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌తో మాట్లాడాడు. వారితో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ తరువాత మీ లైఫ్‌ ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నాడు. సభ్యులు వారి అనుభవాలను నానికి తెలియజేశారు. ఆ తరువాత నాని ఫైనలిస్ట్‌లతో మాట్లాడుతూ.. వారి కుటుంబ సభ్యులు అందరినీ చూపించాడు. సామ్రాట్‌తో మాట్లాడుతూ.. సామ్రాట్‌ నువ్వు దీప్తిలాగా బాగా చేశావు. దీప్తికి టైటిల్‌ వస్తే నీకు ఇవ్వాలా లేక దీప్తికి ఇవ్వాలా అనే డైలమాలో పడిపోయాను అన్నారు. ఇక తనీష్ తో నాని మాట్లాడుతూ.. అమ్మని చూపించాడు. ఇక తనీష్ వల్ల అమ్మ చాలా ఎమోషన్‌ అయింది. బిగ్‌బాస్‌ వేదికపై తెలుగు టైటాన్స్‌ దమ్మిది అంటూ.. ఇచ్చిన ఎంట్రీ హైలైట్‌గా మారింది. నాని చేతుల మీదుగా తెలుగు టైటాన్స్‌ జెర్సీ విడుదలచేశాడు.

ఈ రోజు మొదటగా ఎలిమినేట్‌ అయిన సభ్యుడు సామ్రాట్‌. హౌస్‌లో సామ్రాట్‌ వీడియోను బిగ్‌బాస్‌ చూపించారు. లైఫ్ లో రిలేషన్‌ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను అని సామ్రాట్‌ చెప్పాడు. స్టేజ్‌ పై నుంచి కిందకు దిగిన సామ్రాట్‌ తన తల్లిదండ్రులని హత్తుకున్నాడు. ఈరోజు రెండో ఎలిమినేషన్ దీప్తి నల్లమోతు. మీరు హౌస్‌లోకి వెళ్లాక ఏం నేర్చుకున్నారు అని అడగ్గా చాలా ఉన్నాయి అన్నారు. అంతొద్దు ఫినాలే కోసం చెప్పండి చాలు అనగా స్టేజ్‌పై నవ్వులు రువ్వాయి. మనకోసం మనం నిలబడాలి, పక్కవారికోసం నిలబడాలి, సాధించే వరకూ పట్టు వదలకూడదు అని దీప్తి నల్లమోతు అన్నారు.

మూడో ఎలిమినేషన్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశారు. ముగ్గురినీ మూడు రూముల్లోకి పంపించాడు. బజర్ వచ్చాక అందరూ హాల్లోకి రావాలన్నాడు. రానివాళ్లు ఎలిమినేట్ అయినట్లు అన్నాడు. అలా తనీష్ ఎలిమినేట్ అయ్యాడు. బయటకు రాగానే ముందుగా స్టేజ్‌పై నుంచి దూకి తన తల్లిని హత్తుకున్నాడు తనీష్. ఆ తర్వాత తన జర్నీఏవీని బిగ్‌బాస్‌ చూపించారు. ఆ తర్వాత అమెజాన్‌ డాట్ ఇన్ వారు ఓ కామన్‌ మ్యాన్‌ను సెలెక్ట్ చేశారంటూ రోల్‌రైడాకు ఓ వ్యక్తి ద్వారా కప్‌ను అందించారు. టోటల్‌ బిగ్‌బాస్ జర్నీ వీడియోను అందరికీ చూపించారు.

ఫైనల్‌గా బిగ్‌బాస్-2 విన్నర్‌ను సెలెక్ట్ చేసి తీసుకొస్తానంటూ నాని హౌస్‌లోపలికి వెళ్లాడు. ఇద్దరు ఫైనలిస్ట్‌లను తీసుకుని మెయిన్‌డోర్‌ నుంచి బయటకు వచ్చాడు. ఆ తరువాత స్టేజ్‌ పై ఐదుగురు ఫైనలిస్ట్‌లను స్టేజ్‌ పైకి పిలిచి KLM షోరూం వారు అందించిన లక్ష రూపాయల చెక్కులను ఇచ్చారు. అనంతరం కౌశల్‌ ఎవీ చూపించారు. ఆఖరిగా గీతా మధురి ఎవీ చూపించారు. ఇక ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం విన్నర్‌ని అనౌన్స్‌ చేయడానికి విక్టరీ వెంకటేష్ బిగ్‌బాస్‌ స్టేజ్‌మీదకు వచ్చారు. అయితే వెంకటేష్ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నాని ప్రయాణం ఎవీ చూపించారు. కౌశల్‌ని బిగ్‌బాస్‌ విన్నర్‌గా బిగ్‌బాస్‌ తన టీవీలో చూపించారు. వెంకటేష్‌ చేతుల మీదుగా కౌశల్‌ ట్రోఫి అందుకున్నారు

టైటిల్‌ గెలిచిన ఆనందంలో కౌశల్‌ తన ఇంటి సభ్యులను కౌగిలించుకున్నారు. ఫైనల్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన అందరికీ ధన్యావాదాలు, మీరంతా నాతో ఫైట్ ఇవ్వడం వల్లే నాలో గెలవాలనే కసి పెరిగింది. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అన్నారు కౌశల్. అలాగే తన మదర్ కేన్సర్‌తో చనిపోయారని చెబుతూ.. తనకు వచ్చిన రూ. 50 లక్షల క్యాష్ ఫ్రైజ్‌ను కేన్సర్ బాధితులకు విరాళంగా ప్రకటించారు కౌశల్. నాని టీవీ కట్టేసే టైమొచ్చిందంటూ చివరిగా ప్యాక్‌ అప్ అంటూ బిగ్‌బాస్‌-2 ముగించారు.