HomeTelugu Newsశివ ప్ర‌సాద్ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

శివ ప్ర‌సాద్ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

ప్ర‌ముఖ నిర్మాత‌ డి.శివ ప్ర‌సాద్ రెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివ ప్రసాద్‌ రెడ్డి 1956లో నెల్లూరు జిల్లాలోని ఉత్తరమూపులో జన్మించారు. సుదర్శనమ్మ, డి.వి. శేషారెడ్డిలు ఆయన తల్లిదండ్రులు. నెల్లూరులో హైస్కూలు చదువు పూర్తి చేసిన ఆయన విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో బీఏ చదివారు. చదువు పూర్తయిన తర్వాత సినిమాలకు డబ్బు ఇస్తూ వ్యాపారం చేస్తూ ఉండేవారు. సినీ పరిచయాలు పెరిగి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. నిర్మాత శివప్రసాద్‌ మరణవార్త తెలియగానే ఆయన కుమారుడు చందన్‌తో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ‘కామాక్షి మూవీస్‌ అధినేత శివ ప్రసాద్‌ రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రీ’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సాత్వికుడు, నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి అన్నారు. శివ ప్రసాద్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

3 23

నాగార్జున: నా స్నేహితుడు, నిర్మాత, గత 33 ఏళ్లుగా నా సినీ కెరీర్‌, జీవితంలో భాగమైన శివ ప్రసాద్‌ రెడ్డిని ఇవాళ కోల్పోయా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

పరుచూరి గోపాలకృష్ణ: మా నిర్మాత శివప్రసాద్‌ రెడ్డి గారు ఈ రోజు పరమపదించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

సుమంత్‌: శివయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన నాకు, నా కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తి.

శ్రీను వైట్ల: శివప్రసాద్‌ రెడ్డి కన్నుమూయడం చాలా బాధాకరం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

రఘు కుంచె: శివ ప్రసాద్‌ గారి ఆత్మకు శాంతి కలగాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu