
The Royals Netflix Movie Review:
ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ నుండి వచ్చిన తాజా సిరీస్ The Royals ఇప్పుడు ట్రోలింగ్‌కు కేంద్రబిందువైంది. గ్లామర్, రొమాన్స్, రాజకీయ సాటైర్ అని చెప్పిన ఈ సిరీస్, అసలు ఏమైందో ఎవరికీ అర్థం కాకుండా మారింది. కథ, పేసింగ్, పాత్రల బలహీనతలు ఇవన్నీ కలసి ప్రేక్షకులను అసహనం చెందేలా చేశాయి.
భూమి పడ్నేకర్ నటించిన సోఫియా కన్మణి అనే స్టార్ట్‌అప్ ఎంటర్ప్రెనర్ పాత్ర అయితే మరీ ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె డైలాగ్స్ అన్నీ LinkedIn పోస్టులా ఉంటాయని సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. “ప్యాలెస్‌లను అద్దెకు ఇచ్చే” యాప్ ఐడియా TEDx టాక్‌లు వింటున్నట్టు ఫీల్ కలిగిస్తోంది. ఆమె క్యారెక్టర్ చూసి చాలామంది “సెకండ్ హ్యాండ్ ఎంబారస్మెంట్” అనుభవించారట.
View this post on Instagram
ఇషాన్ ఖత్తర్ నటించిన అవిరాజ్ సింగ్ పాత్ర కూడా బలహీనంగానే ఉంది. అతను ఎక్కువసేపు షర్ట్ లేకుండా తిరగడం, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీనట్లే ఉండటం ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ కలిగించింది. సోఫియాతో అతని రొమాన్స్ చూసి నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హాస్యనటిగా మంచి పేరు ఉన్న సుముఖి సురేష్‌కు కూడా ఈ సిరీస్‌లో సరైన పాత్ర దక్కలేదు. ఆమె కామెడీ పాయింట్లు చాలా సందర్భాల్లో పని చేయలేదు.
ఈ సిరీస్‌ను రొమాంటిక్ కామెడీగా, సాటైరికల్ డ్రామాగా చూపించాలనుకున్న నెట్‌ఫ్లిక్స్, చివరకు ఏదీ సరిగా చేయలేకపోయింది. దాంతో ప్రేక్షకుల ట్రోలింగ్ మొదలైంది.
ALSO READ: NTR Dragon సినిమాలో హీరోయిన్ ఎవరంటే