‘దబాంగ్ 3’ కథ ఇదేనా!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న’దబాంగ్’ సీరీస్ లో మూడో సినిమా ‘దబాంగ్ 3’ రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఇండోర్ లో జరుగుతున్నది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌ పాత్ర పోషిస్తుంది. సౌత్ స్టార్ హీరో, డైరెక్టర్‌ ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటె, దబాంగ్ 3 కథ ఏంటి.. దేని గురించి ఈ సినిమాలో ముఖ్యంగా ప్రస్తావించబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

సల్మాన్ ఖాన్ పాస్ట్ లైఫ్ ను పరిచయం చేస్తూ కథ ఉంటుంది. చుల్ బుల్ పాండే పోలీస్ ఆఫీసర్ కాకముందు,గూండాగా ఉండేవాడు. గూండా అయినప్పటికీ మంచితనం నిండి ఉంటుంది. ల్యాండ్ మాఫియాను ఎదిరించేందుకు చుల్ బుల్ పాండే రౌడీ నుంచి పోలీస్ ఆఫీసర్ గా మారతాడు. ఇలా పోలీస్ గా మారి ల్యాండ్ మాఫియాను ఎలా ఎదిరించాడు అన్నది కథ. పక్కా కమర్షియల్ గా మాస్ కు నచ్చే ఫార్మాట్ లో చిత్రీకరిస్తున్నారట.