
Andhra King Taluka Update:
రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా” ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పాత్ర కోసం ముందుగా నందమూరి బాలకృష్ణ ని సంప్రదించారు.
ఈ సినిమాలో ఉపేంద్ర తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా స్టార్ పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య ఈ పాత్ర స్క్రిప్ట్ విన్నప్పటికీ, తనకు కన్‌విన్స్ కాకపోవడంతో ఈ పాత్రను తిరస్కరించారు. Mythri Movie Makers కు ఆయన స్వయంగా చెప్పడంతో, వారు ఉపేంద్రను ఎంచుకున్నారు.
View this post on Instagram
బాలకృష్ణ ఈ సినిమాలో నటించి ఉంటే, సినిమాకు మరింత గ్లామర్ వచ్చేది. అయితే సరైన ప్రత్యామ్నాయం లేనందున, దర్శకుడు ఉపేంద్రను సంప్రదించారు. ఉపేంద్ర పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతృప్తిగా ఉన్నారు.
భాగ్యశ్రీ బోర్స్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్ కు ఈ సినిమాలో ఫ్రెష్ లుక్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిగిలిన షూటింగ్ త్వరలో పూర్తిచేసి ఈ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఉపేంద్ర వంటి స్టార్ ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. “ఆంధ్ర కింగ్ తాలూకా” విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: NC24 సినిమాలో Naga Chaitanya, Meenakshi Chaudhary ల పాత్రలు ఇవే..