మనోజ్ డేట్ ఫిక్స్ చేశాడు!

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా  ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై రూపొందుతున్న చిత్రం ‘ఒక్క‌డు మిగిలాడు’.  ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు అజ‌య్ అండ్రూస్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మ‌నోజ్‌తో ఏడాదిన్న‌ర‌గా ట్రావెల్ అవుతున్నాను. హింస‌ – అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే పరిస్థితులకు తగ్గట్టు ఎలా అయితే ప్రవర్తిస్తామో అదేవిధంగా ఉంటుంది  మనోజ్ గారి క్యారెక్టరైజేషన్. ఈ సినిమా కోసం మ‌నోజ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. 10 కిలోలు త‌గ్గాడు. నిర్మాతలు ఎంతో స‌పోర్ట్ చేశారు” అన్నారు.  
 
నిర్మాతలు  ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. “గ్రాఫిక్స్ వర్క్ వల్లే సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఆ ఆలస్యం కూడా మంచిదే.. సముద్రం దగ్గర షూట్ చేసిన సీన్స్ విశేషంగా ఆకట్టుకొంటాయి. ఇక వార్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం” అన్నారు.