
Tollywood 2025 Box-office:
ఈ ఏడాది టాలీవుడ్‌కు ఆశించినంతగా కలిసి రాలేదు. పెద్ద సినిమాలు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా నిరాశే మిగిలింది. ఒక్కొక్కటిగా చూద్దాం ఎప్పుడేం జరిగిందో.
జనవరి: వెంకటేశ్ “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. సంక్రాంతి పండుగ సమయంలో థియేటర్ల దగ్గర జనం పోటెత్తారు. బాలకృష్ణ “దాకు మహారాజ్” మాత్రం ఓ మోస్తరుగా విజయాన్ని అందుకున్నాడు. కానీ రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” మాత్రం ఈ ఏడాది టాలీవుడ్‌కి వచ్చిన అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఫిబ్రవరి: నాగ చైతన్య నటించిన “థండేల్” అతని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం కాగా, అదే అతనికి బిగ్గెస్ట్ హిట్ కూడా అయ్యింది. విశ్వక్ సేన్ “లైలా”, సందీప్ కిషన్ “మజాకా” మాత్రం భారీ డిజప్పాయింట్‌మెంట్లు.
మార్చ్: నాని నిర్మించిన “కోర్ట్” అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు థియేటర్లలో పుంజుకునే అవకాశాన్ని ఇచ్చింది. “MAD స్క్వేర్” కూడా సీక్వెల్ పावरతో హిట్ కొట్టింది. నితిన్ “రాబిన్ హుడ్”, కిరణ్ అబ్బవరం “దిల్‌రుబా” మాత్రం నమ్మకాన్ని వమ్ము చేశాయి.
ఏప్రిల్: ఈ నెల టోటల్‌గా డిజాస్టర్. సిద్ధు “జాక్”, కల్యాణ్ రామ్ “అర్జున్”, సంపత్ నంది “ఒడెల 2”, ప్రియదర్శి “శరంగపాణి జాతకం” – అన్నీ అట్టడుగున పడిపోయాయి.
మే: నాని “హిట్ 3” మంచి ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయ్యింది. కాస్త హింస ఎక్కువగా ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉన్నా, డీసెంట్ హిట్ అయ్యింది. శ్రీ విష్ణు “సింగిల్” మాత్రం యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చి సక్సెస్ అయ్యింది. సమంత “శుభం”, బెల్లంకొండ “భైరవం” ఫ్లాప్ అయ్యాయి.
జూన్: ధనుష్-నాగార్జున కలయికలో వచ్చిన “కుబేరా” బ్లాక్‌బస్టర్. శేఖర్ కమ్ముల మార్క్ వర్క్ అయ్యింది. మంచు విష్ణు “కన్నప్ప” కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుని డీసెంట్ హిట్ అయ్యింది. మైత్రి మేకర్స్ నిర్మించిన “8 వసంతాలు” మాత్రం డిజాస్టర్.
డబ్బింగ్ సినిమాలు: తమిళం నుంచి వచ్చిన “డ్రాగన్” తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మోహన్‌లాల్ “తుదారం”, హిందీ చిత్రం “ఛావా” డీసెంట్. అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ”, కమల్ హాసన్ “థగ్ లైఫ్” మాత్రం ఫెయిల్యూర్.
ALSO READ: చాలా కాలం తర్వాత విడాకుల గురించి మాట్లాడిన Abhishek Bachchan!












