
Summer Releases 2025:
ఈసారి వేసవి కూడా వృధా అయ్యింది! ఇది వరుసగా మూడో సమ్మర్, తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక బిగ్ సినిమాని కూడా ఇవ్వకుండా పోయింది. వేసవి అంటే పెద్ద సినిమాల హంగామా ఉండాలి కానీ, 2025 సమ్మర్‌లో అటువంటి దాంట్లో ఒక్కడు కూడా లేదు. శ్రీ విష్ణు నటించిన సింగిల్ తప్ప, మిగతా సినిమాలేవీ ఏమాత్రం గెలవలేకపోయాయి.
వాస్తవానికి ఈ వేసవి భారీ సినిమాల హడావిడి ఉండాల్సింది. కొన్ని బడా సినిమాలు ప్రణాళికలో ఉన్నా, చివరికి వాటి రిలీజ్ వాయిదాపడటంతో మొత్తం షెడ్యూల్ అల్లకల్లోలం అయింది. వాటిలో ఈ మూడు బిగ్ బడ్జెట్ సినిమాలే ప్రధాన కారణాలు:
1. విశ్వంభర: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ మొదట సంక్రాంతికి ప్లాన్ చేశారు. కానీ రామ్ చరణ్ మూవీ “గేమ్ ఛేంజర్” ఆలస్యం కావడంతో, విశ్వంభరను వేసవి రిలీజ్‌కి మళ్లించారు. మే 9న రిలీజ్ అనుకున్నారు కానీ VFX వర్క్ పూర్తవకపోవడం వల్ల మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటికీ విడుదలపై స్పష్టత లేదు.
2. హరిహర వీర మల్లు: చిరంజీవి మూవీ పోటీలోంచి బయటపడిన వెంటనే, పవన్ కళ్యాణ్ నటించిన ఈ మల్టీ లాంగ్వేజ్ మూవీ మే 9కి ప్లాన్ అయింది. కానీ పవన్ రాజకీయాల వల్ల షూటింగ్ పూర్తయ్యేలోపే సమ్మర్ ముగిసిపోయింది. సినిమా జూలైలో రానుందని అంచనాలు.
3. కింగ్డమ్: విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నాడు. మే 31 రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవకపోవడం వల్ల జూలై 4కి వాయిదా వేశారు. దీనితో ఇది కూడా సమ్మర్ రేస్ నుంచి అవుట్ అయ్యింది.