HomeTelugu Big Storiesనటుడు పృథ్వీరాజ్‌కు తీవ్ర అస్వస్థత

నటుడు పృథ్వీరాజ్‌కు తీవ్ర అస్వస్థత

Comedian Prudhviraj hospita

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ సినీ పరిశ్రమలో ఫేమస్ అయిన నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నట్లు ఈ మేరకు ఆయనే స్వయంగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరుకుంటున్నానంటూ ఆ వీడియోలో ఆవేదన చెందుతూ మాట్లాడారు. లాక్ డౌన్‌తో చాలాకాలం ఇంటికే పరిమితమైన పృథ్వీరాజ్ తర్వాత ఇచ్చిన సడలింపులతో బయటకు వచ్చారు. కొన్ని షూటింగ్స్ లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu