
Sankranthi 2026 Releases Telugu:
సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌కి పండుగే! ప్రతి సంవత్సరం ఈ సీజన్‌కి పెద్ద పెద్ద సినిమాలు బరిలోకి దిగుతూ బాక్సాఫీస్‌కి కొత్త రికార్డులు సెట్ చేస్తున్నాయి. ఇప్పుడే 2026 సంక్రాంతికి ప్లాన్‌లు మొదలయ్యాయి. ఇప్పటికే మూడు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, ఇంకొన్ని ప్లానింగ్‌లో ఉన్నాయట.
చిరంజీవి – అనిల్ రవిపూడి సినిమా: మెగాస్టార్ చిరంజీవి కొత్తగా అనిల్ రవిపూడి డైరెక్షన్‌లో ఒక ఎంటర్టైనర్ చేయబోతున్నారు. మే 22 నుండి షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాను సంక్రాంతి 2026కి రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
అఖండ 2: బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2’ కూడా సంక్రాంతికి రెడీ అవుతోంది. మొదట ఈ సినిమాను దసరాకు అనుకున్నా, ఇప్పుడు సంక్రాంతి 2026కి పోస్ట్‌పోన్ చేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమా: విక్టరీ వెంకటేష్‌తో త్రివిక్రమ్ చేయబోయే ఎంటర్టైనర్ కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వొచ్చని టాక్. జూలైలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. విడుదల తేదీపై క్లారిటీ త్వరలో రానుంది.
జన నాయకన్: తమిళ తలపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయకన్’ కూడా జనవరి 9న విడుదల కానుంది. హ్.వినోత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది.
అయితే, వెంకటేష్ సినిమా సంక్రాంతికి రాకపోతే, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న “అనగనగా ఒక రాజు” సినిమాను మేకర్స్ ఆ సీజన్‌కి రానిచేస్తారట.
ALSO READ: NC24 సినిమాలో Naga Chaitanya, Meenakshi Chaudhary ల పాత్రలు ఇవే..