HomeTelugu Big Storiesడ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్

Drugs case Heroine

ముంబైలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్టయిందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ముంబైలోని మీరా రోడ్డులోని ఓ హోటల్లో ఎన్‌సీబీ అధికారులు చేసిన దాడిలో ఆ హీరోయిన్‌ డ్రగ్స్‌తో దొరికింది. హీరోయిన్‌తో పాటు చాంద్, సయ్యద్ అనే మరో ఇద్దరిని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 400 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పట్టుబడిన నటికి మాఫియా డాన్‌ కరీంతో సంబంధాలున్నట్టు తెలిసి సంచలనంగా మారింది. కరీంతో కలిసి హీరోయిన్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. డాన్ కరీం కోసం అధికారులు గాలిస్తున్నారు. దేశం విడిచి పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేసింది. బాలీవుడ్‌లో హీరో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ లింకులు చాలావరకు బయటపడ్డాయి. ఈ కేసులోఇప్పటికే పలువురు ప్రముఖులను ఎన్‌సీబీ విచారించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu