HomeTelugu Big Storiesబండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌.. !

బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌.. !

13 7
భారత్‌ కరోనా వైరస్‌ కరోనా విళయ తాండవం చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ వైరస్‌ ఎలా అటాక్ చేస్తూనే ఉంది. తాజాగా టాలీవుడ్‌ నిర్మాత, పారిశ్రామిక వేత్త బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా, ఎందుకో సందేహం వచ్చి టెస్ట్ చేయించుకున్నట్లు, అందులో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. దాంతో బండ్ల భార్య పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటి ఫలితాల ఇంకా రావాల్సి వుంది.

ఇది ఇలా వుంటే బండ్ల గణేష్ వున్న గేటెడ్ కమ్యూనిటీలోనే హీరో నాగశౌర్య ఫ్యామిలీ, కళామందిర్ కళ్యాణ్ ఫ్యామిలీ లాంటి ప్రముఖులు వున్నారు. ఫిల్మ్ నగర్ డౌన్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీ వుంది. బండ్ల గణేష్ నిత్యం షాద్ నగర్ పౌల్ట్రీ ఫారమ్ కు వెళ్లి వస్తుంటారు. అలాగే ఆయన తన బిజినెస్ పనుల మీద ఎక్కువగా తిరుగుతూ వుంటారు.

ఇటీవల బండ్ల ఎవరు ఎవరిని కలిసారు అన్నది పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీలో మిగిలిన వారికి కూడా పరిక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బండ్ల గణేష్ ను ప్రశ్నించగా, తనకు ఏ పాజిటివ్ లేదని, తన ఆరోగ్యం బాగానే వుందని అన్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu