HomeTelugu Big Storiesఐసోలేషన్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు

ఐసోలేషన్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు

Tollywood star Heroes in Ho
కరోనా సెకండ్‌ వేవ్‌ లో.. వరుసగా సినీసెలబ్రిటీలంతా కోవిడ్ బాధితులుగా మారుతుంటే టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా షూటింగులు బంద్ చేసి ఇంటిలోనే స్వీయ నిర్భంధంలో ఉంటున్నారు. ఈ జాబితా అంతకంతకు పెరుగుతోంది. మహేష్‌ బాబు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. డార్లింగ్ ప్రభాస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరంతా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. తన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రభాస్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు .. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నిర్భంధంగా ఉన్నారు. మహేష్ వ్యక్తిగత స్టైలిస్ట్ కి ‘సర్కారు వారి పాట’ సెట్స్‌లో వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇది తెలుసుకున్న మహేష్ తన కుటుంబ వైద్యుడిని సంప్రదించారు. దీంతో సర్కార్ వారి షూటింగ్ షూటింగ్‌ వాయిదా పడింది. మే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.

కరోనా తన వ్యక్తిగత వానిటీ వ్యాన్ డ్రైవర్ ఇటీవల కన్నుమూసిన తరువాత మెగా హీరో రామ్ చరణ్ కూడా ఒంటరిగా ఉన్నారు. చరణ్ ఇంతకుముందు వైరస్ పాజిటివ్ కి చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసినదే. అతను ఇప్పుడు కఠిన నియమాలు పాటిస్తూ ఒంటరిగా ఉన్నాడు. బయటి ప్రపంచం నుండి తనను తాను పూర్తిగా డిస్కనెక్ట్ చేశాడు. పరిశ్రమ స్నేహితులంతా ఐసోలేషన్ లో ఉండగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారని సమాచారం. ఆర్.ఆర్.ఆర్ షూట్ ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆచార్య చిత్రీకరణను చిరంజీవి స్వచ్ఛందంగా నిలిపివేశారు. ఖిలాడి దర్శకుడు రమేష్ వర్మ కరోనా పాజిటివ్ రాగానే.. రవితేజ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకున్నారు. నాని.. నాగ చైతన్య వంటి యువ నటులు తమ తదుపరి ప్రాజెక్టుల షూటింగ్ లో ఉన్నారు. సెకండ్ వేవ్ వల్ల చాలా మంది నటీనటులు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!