
Tollywood July Releases 2025:
2025 తొలి అర్ధ భాగం తెలుగు సినిమాలకు పెద్దగా కలిసి రాలేదు. చాలా పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి, రిలీజ్ అయినవాటిలో కూడా హిట్ టాక్ వచ్చినవి తక్కువే. ఇప్పుడు జూలై మాసంపై ఆశలు పెట్టుకున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, వరుసగా నాలుగు బిగ్ బడ్జెట్ సినిమాల విడుదలతో ఓ బ్రేక్‌థ్రూ ఆశిస్తోంది.
పవన్ కల్యాణ్ ‘హరి హర వీర మల్లు’:
పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యిన తర్వాత థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ అందరూ హైప్‌లో ఉన్నారు. రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నాన్-థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 100 కోట్లు దక్కించాయి. అంటే థియేట్రికల్‌గా భారీ కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఉంది.
విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’:
హరి హర వీర మల్లూ సినిమా విడుదలై వారం రోజులకు విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ రానుంది. రూ. 100 కోట్లు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు కూడా బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద పరీక్షే ఎదురవుతుంది. విజయ్‌కు ఇది మాస్ ఫ్యాన్‌బేస్‌ను రీచయ్యే ఛాన్స్.
ఎన్టీఆర్ – హృతిక్ ‘వార్ 2’:
ఈ రెండు సినిమాల తరువాత వచ్చే భారీ సినిమాల్లో ముందుగా ఉంది ‘వార్ 2’, రూ. 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ మల్టీస్టారర్ సినిమా ఉత్తరభారత మార్కెట్‌లో హృతిక్ రోషన్ క్రేజ్‌తో ఓపెనింగ్స్ భారీగా రావచ్చు. సౌత్‌లో ఎన్టీఆర్ ఉండటంతో మరింత అట్రాక్షన్ ఏర్పడుతుంది.
రజినీకాంత్ ‘కూలీ’:
‘కూలీ’ సినిమాని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. బడ్జెట్ ఇదీ రూ. 400 కోట్లు! నాలుగు వారాల్లోనే టోటల్ గా రూ. 1200 కోట్లు పైనే పెట్టుబడి పెట్టారు నిర్మాతలు.
జూలై నెలలో నాలుగు పెద్ద సినిమాల మీదే టాలీవుడ్ భవిష్యత్ ఆధారపడుతుంది. మొత్తం రూ. 1200 కోట్ల పెట్టుబడి ఓ నెలలోనే ట్రేడ్ సర్కిల్స్‌ను ఉత్కంఠతకు గురిచేస్తోంది. ఆశించేదేమిటంటే – ఈ నాలుగు సినిమాలూ హిట్ అయితే, ఇండస్ట్రీకి బ్రేక్ తక్కువే!













