HomeTelugu Trending'అమిగోస్‌' ట్రైలర్‌ అప్‌డేట్‌

‘అమిగోస్‌’ ట్రైలర్‌ అప్‌డేట్‌

Amigos trailer update
నందమూరి కల్యాణ్‌రామ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తికరం ఎదురు చూస్తున్న చిత్రం ‘అమిగోస్’. రాజేంద్రరెడ్డి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమిగోస్‌ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ట్రైలర్‌ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. రేపు సాయంత్రం 5:49 నిమిషాలకు ట్రైలర్‌ను లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. కల్యాణ్‌ రామ్‌ రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని యాక్షన్‌ మూడ్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాడు.

అమిగోస్‌లో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు‌. కల్యాణ్ రామ్ మరోవైపు నవీన్‌ మేడారం దర్శకత్వంలో డెవిల్‌ : ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ మూవీ కూడా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu