HomeTelugu Trendingఆ హాలీవుడ్‌ జంటకు కరోనా వైరస్‌..

ఆ హాలీవుడ్‌ జంటకు కరోనా వైరస్‌..

1 11
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ మహమ్మారి ఇప్పటికే 4300 మంది ప్రాణాలను బలితీసుకుంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు విజేత టామ్‌ హాంక్స్‌, అతని భార్య రిటా విల్సన్‌కు కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టామ్‌ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. 63సంవత్సరాల వయసున్న ఈ జంటకి జలుబు, తలనొప్పి ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. అయితే ప్రస్తుతం ప్రత్యేక పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నారని టామ్‌ వెల్లడించాడు. ‘ఇప్పుడు మేం చేయాల్సింది..కేవలం వైద్యుల సూచనలను పాటించడమే’ అన్నారు. వార్నర్‌బ్రదర్స్‌ నిర్మాణంలో వస్తున్న తన తదుపరి చిత్రంకోసం టామ్‌ హాంక్స్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. కాగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాల్లో లక్షా ఇరవైఐదు వేల మందికి సోకిన కరోనాను డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu