
Tollywood Controversies in May:
మే 2025 ముగిసింది. కానీ ఒక స్పెషల్ లిస్ట్ విడుదల అయ్యింది. ఈ నెలలో వార్తల్లోకెక్కిన టాప్ 10 టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు? కొందరు మంచి పనులతో, మరికొందరు వివాదాలతో టాప్ టెన్లో చోటు సంపాదించారు.
1. దిల్ రాజు: థియేటర్ స్ట్రైక్ విషయంలో మధ్యలో చిక్కుకొని, రాజకీయ ఒత్తిళ్లతో ఇరుకున్నారు. ఇండస్ట్రీలో తన స్థాయికి తగిన డామేజ్ అయ్యిందనే చెప్పాలి.
2. సందీప్ రెడ్డి వంగా: క్రియేటివ్ డిఫరెన్సెస్‌ను అభిమానులు పెద్ద హడావుడిగా మార్చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్న విషయం పెద్దదైపోయింది.
3. ఎన్టీఆర్: వార్ 2 టీజర్‌కు నెగటివ్ టాక్ వచ్చింది. అభిమానుల్లో నిరాశ వెల్లివిరిచింది.
4. తేజ సజ్జ: వారం రోజుల్లోనే టీజర్‌తో నెట్టింట సంచలనం సృష్టించాడు. మిరాయ్ టీజర్‌కు భారీగా పాజిటివ్ బజ్ వచ్చింది.
5. మంచు విష్ణు: కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మిస్ అయినదని షాకింగ్ కంప్లయింట్ పెట్టారు. ఇది కొత్త కలకలం రేపింది.
6. కమల్ హాసన్: తగ్ లైఫ్ సినిమా రిలీజ్ కాకముందే వివాదాల్లో పడింది. కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలతో కన్నడ ఫిల్మ్ చాంబర్ సినిమానే బాన్ చేసేసింది.
7. సమంత: ఒక మిస్టీరియస్ ఫొటోలో రాజ్ తో కనిపించి, లవ్ రూమర్స్‌కు స్టార్ట్ ఇచ్చింది. అభిమానులు ఊహాగానాల్లో మునిగిపోయారు.
8. శ్రీ విష్ణు – వెన్నెల కిషోర్: సింగిల్ అనే సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. హిట్ టాక్ రాలేదు కానీ స్టేడీగా నడిచింది.
9. నాగార్జున: కూలీ మూవీలో బ్యాక్ షాట్ మాత్రమే వచ్చింది కానీ అది ట్రెండ్ అయిపోయింది. నేచురల్ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
10. భైరవం డైరెక్టర్: రాజకీయ వ్యాఖ్యలతో YSRCP అభిమానులు రెచ్చిపోగా, మేగా ఫ్యాన్స్ పాత పోస్టు బయటపెట్టి బహిష్కరణ పిలుపునిచ్చారు.
ALSO READ: Shah Rukh Khan తలపై గట్టిగా కొట్టిన ప్రియా గిల్..













