HomeTelugu Newsబ్రహ్మానందంకు హార్ట్‌ సర్జరీ..!

బ్రహ్మానందంకు హార్ట్‌ సర్జరీ..!

3 17ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్‌ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్‌ ఇన్సిస్టిట్యూట్‌లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్‌ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో ట్వీట్లు, కామెంట్‌లు చేస్తున్నారు. ఆయన కుమారులు గౌతమ్‌, సిద్ధార్థ్‌లతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu