HomeTelugu Newsత్రిష నిర్ణయంతో ఫ్యాన్స్‌ షాక్‌

త్రిష నిర్ణయంతో ఫ్యాన్స్‌ షాక్‌

4 22
టాలీవుడ్‌, కోలీవుడ్‌లో హీరోయిన్‌ త్రిషకి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోను టాప్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఆమె తన హవాను కొనసాగించింది. అయితే ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్‌లతో పోటీ తట్టుకోలేక కొంత డీలా పడింది ఈ అమ్మడు. అయితే తాజాగా టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్‌గా
త్రిష నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ సమయంలో భారీ ఆఫర్ నే కొట్టేసిందని అనుకున్నారు.

ఈ తరుణంలో.. ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు త్రిష ప్రకటించింది. తన పాత్రకి ప్రాధాన్యత లేదనే కారణంగా ‘నో’ చెప్పిందని కొందరంటే, తమిళ సినిమాల్లో బిజీగా ఉండటం వలన అని మరికొందరు అన్నారు. అలాంటి త్రిష ఇప్పుడు రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. రవితేజ – రమేశ్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో ఆమె ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. దాంతో ‘ఆచార్య’ సినిమాకి నో చెప్పిన త్రిష, రవితేజతో జతకట్టడానికి ఒప్పుకోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!