త్రివిక్రమ్ కథకు పవన్ ఇన్ పుట్స్..?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

అయితే ఈ కథకు పవన్ కల్యాణ్ తన ఇన్ పుట్స్ ఇస్తున్నాడని సమాచారం. కథ ఈ విధంగా ఉండాలని ప్రత్యేకంగా
పాత్రలను డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జల్సా సినిమా విషయంలో కూడా పవన్ త్రివిక్రమ్ కు కొన్ని సలహాలు ఇచ్చారు.

ఆ సినిమాలో ఉండే నక్సలిజం బ్యాక్ డ్రాప్ మొత్తం పవన్ ఆలోచనే.. అలానే ఈ సినిమాలో కూడా అవినీతి, పేదరికం వంటి అంశాలను ఆధారంగా చేసుకొని కథను సిద్ధం చేయమన్నట్లు తెలుస్తోంది. కథల విషయంలో పవన్ జోక్యం చేసుకున్న కొన్ని చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

అయితే ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తున్నది  త్రివిక్రమ్ కాబట్టి అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఫైనల్ ఔట్ పుట్ ఎలా ఉంటుందో.. చూడాలి!