నిఖిల్ అధృష్టం మామూలుగా లేదు!

స్వామిరారా వంటి సక్సెస్ ఇచ్చిన సుధీర్ వర్మతో కలిసి ‘కేశవ’ అనే రివెంజ్ స్టోరీలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా సమ్మర్ సీజన్ అదీ మే నెల అంటే సినిమాల పోటీ మామూలుగా ఉండదు. పెద్ద సినిమాలకు మాత్రమే సోలో రిలీజ్ దక్కే అవకాశాలు ఉంటాయి. అలాంటిది నిఖిల్ సినిమాకు సోలో రిలీజ్ ఛాన్స్ రావడం అంటే చిన్న విషయం కాదు.
నిజానికి ఆరోజు రావాల్సిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా 26కి వాయిదా పడింది. గోపిచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ కూడా వెనుకడుగు వేసింది. ఈ వారం వచ్చిన సినిమాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అప్పటికి బాహుబలి హవా కూడా తగ్గుతుంది కాబట్టి నిఖిల్ సినిమాకు మంచి టాక్ వస్తే చాలు.. ఇక దూసుకుపోవడం ఖాయం. మరి ఈ అవకాశాన్ని కేశవ ఎంతవరకు వినియోగించుకుంటాడో. చూడాలి!