అలీ చేతుల‌మీదుగా ‘బ్లాక్‌మ‌నీ’!

సౌత్ సూప‌ర్‌స్టార్‌ మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ `రన్ బేబి ర‌న్‌` తెలుగులోకి  `బ్లాక్‌మ‌నీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో ఈనెల 21న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ ఇటీవ‌లే `క్లీన్ యు` స‌ర్టిఫికెట్ ఇచ్చి చ‌క్క‌ని కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న సినిమా ఇద‌ని అభినందించింది. ఈనెల 21న తెలుగు రాష్ట్రాలు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ‌వుతోంది. తాజాగా స్టార్ క‌మెడియ‌న్ అలీ ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని హైద‌రాబాద్‌లో లాంచ్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా అలీ మాట్లాడుతూ -“మోహ‌న్‌లాల్ అంత పెద్ద స్టార్ న‌టించిన ఈ చిత్రం తెలుగులో పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా. ఇటీవ‌లి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న లాల్‌కి మ‌రో గ్రాండ్ స‌క్సెస్ గ్యారెంటీ. అంత పెద్ద స్టార్ న‌టించిన సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం క్రేజీగా ఫీల‌వుతున్నా. ఈ సినిమాతో విజ‌యం సాధించి చిత్ర‌నిర్మాత‌లు మ‌రిన్ని సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తున్నా“ అన్నారు. 
 
నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -“స్టార్ క‌మెడియ‌న్ అలీ చేతుల‌మీదుగా బ్లాక్‌మ‌నీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం సంతోషంగా ఉంది. మంచి మ‌నసుతో మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తున్న అలీకి ధ‌న్య‌వాదాలు. మీడియా నేప‌థ్యంలో తెర‌కెక్కిన `బ్లాక్‌మ‌నీ` పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రంలో లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా న‌టించారు. క‌థానాయిక అమ‌లాపాల్ సీనియ‌ర్ ఎడిట‌ర్ రేణుక పాత్ర‌లో న‌టించారు. సంబంధ బాంధ‌వ్యాలు, వృత్తిప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణ చుట్టూ ఈ సినిమా క‌థాంశం తిరుగుతుంది. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక గ్రాస్ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులోనూ అంతే పెద్ద విజ‌యం అందుకుంటుంద‌ని ఆశిస్తున్నాం. అన్నిప‌నులు పూర్త‌య్యాయి. ఈనెల 21న రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.