‘త్రివిక్రమ్’ పేరుతో ఆండ్రాయిడ్ యాప్!

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులందరికీ ఇదో వేడుక సమయం.. ఎ.బి.సి.డిజిటల్ మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ ను, వెబ్ సైట్ ను ఈ సంస్థ ప్రారంభిస్తోంది. కోట్లాది తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు (నవంబర్ 7) న ఈ కానుకను అందించబోతోంది. ఇక మీదట ఆయన అభిమానులంతా ఒకే ఒక్క క్లిక్ తో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల తాజా విశేషాలను తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను నవంబర్ 7 నుంచి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యూజర్ ఫ్లెండ్లీ యాప్ ఇందులోని అప్ డేట్స్ అన్నింటినీ నోటిఫికేషన్ మెసేజ్ ద్వారా యూజర్స్ కు తెలియచేస్తుంది అని సంస్థ ప్రతినిధి రాహుల్ మీడియా కు తెలిపారు.