HomeTelugu Newsతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం

14 4
తెలంగాణలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం వీచింది. 108 మున్సిపాలిటీల్లో విజయ కేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ 5, బీజేపీ 3, ఎంఐఎం 2 స్థానాలు దక్కించుకున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. రామగుండం, నిజామాబాద్ మినహా అన్ని స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని 14 మున్సిపాలిటీల్లో అన్నింటిలోనూ గులాబీ పార్టీ తన జెండాను ఎగురవేసింది. జగిత్యాలలో తొలిసారి టీఆర్ఎస్ విజయం సాధించింది. సిరిసిల్లలో ఇండిపెండెంట్లు సత్తా చాటినా, టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో గెలుపొందింది. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. మొత్తం 14 మున్సిపాలిటీల్లో 13 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాను కూడా టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ 9 మున్సిపాల్టీలను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 మునిసిపాలిటీల్లో 10 టీఆర్‌ఎస్‌, ఒకటి ఎంఐఎం గెలుచుకున్నాయి. అటు భైంసా ఎంఐఎం ఖాతాలోకి వెళ్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కారు హవా కొనసాగింది. సత్తుపల్లి మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదటిసారి ఎన్నికలు జరిగిన వైరాలోనూ టీఆర్ఎస్ విజయభేరి మోగించింది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో టిఆర్ఎస్ 25, సిపిఐ 8, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించాయి. ఇల్లెందులోని 24 వార్డుల్లో టీఆర్ఎస్‌ 19 చోట్ల గెలిచింది. మొత్తంగా జిల్లాలోని 5 స్థానాలు టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 18 మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలు గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ కూడా గట్టిపోటీ ఇచ్చింది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఉన్న 22 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. తుక్కుగూడ మున్సిపాలిటీలో బిజెపి, ఆదిభట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచాయి. ఇక నిజామాబాద్ లో ఆరు మున్సిపాలిటీలున్నాయి. అన్నిటిని గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఎల్లారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, భీంగల్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu