ఇరవై నిమిషాల సీన్స్ తొలగిస్తున్నారట!

దిల్ రాజు తన సినిమాల విషయంలో ఎన్నో జగత్తలు తీసుకుంటాడు. సినిమా రన్ టైమ్ ఎంత ఉండాలనే విషయాన్ని నిర్ణయించేది ఆయనే. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. సరే ఎడిటింగ్ టేబుల్ దగ్గర మాత్రం దిల్ రాజు తన ఆదిపత్యాన్ని చూపిస్తూనే ఉంటాడు. సినిమా ఎంత క్రిస్పీగా ఉంటే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవుతుందనేది దిల్ రాజు ఆలోచన. ఫిధా సినిమా విషయంలో కూడా దిల్ రాజు మాటలే చెల్లుబాటు అయినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల కు కావల్సినంత ఫ్రీడం ఇచ్చిన దిల్ రాజు సినిమా ఔట్ పుట్ విషయంలో మాత్రం కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది.
సినిమాలో కొన్ని కరెక్షన్స్ తో పాటు ఇరవై నిమిషాల సన్నివేశాలను ట్రిమ్ చేయమని చెప్పినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు సహజత్వంతో కూడి ఉంటాయి. సన్నివేశాలు సహజంగా ఉండాలని కాస్త ల్యాగ్ తో చూపిస్తాడు శేఖర్ కమ్ముల. క్లాస్ ఆడియన్స్ ఆ సాగతీతను కూడా ఇష్టపడతారు. కానీ దిల్ రాజు మాత్రం ట్రిమ్ చేయాల్సిందేనని పట్టుపట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి శేఖర్ కమ్ముల కూడా అంగీకరించక తప్పలేదని సమాచారం. దీంతో సినిమాను వీలైనంత క్రిస్పీగా ఉండేలా చూస్కుంతున్నారు. రెండు గంట పదిహేను నిమిషాల లోపే సినిమా ఉంటే మంచిదని దిల్ రాజు చెప్పినట్లుగా తెలుస్తోంది. సో.. ఈసారి శేఖర్ కమ్ముల సినిమా కూడా ఫాస్ట్ గా ఉండబోతుందన్నమాట!