ఒక పక్క ట్వీట్స్ మరో పక్క షూటింగ్!

ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందన తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు ఉదయం నుండి కేంద్రాన్ని ప్రశించే విధంగా ఓ నాలుగు ట్వీట్స్ పెట్టేశారు. రేపు వైజాగ్ లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ యువత నిరసనకు పవన్ హాజరవుతాడా..? లేదా..? అనే విషయంపై
ఇంకా క్లారిటీ రాలేదు. ఒక పక్క ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తూనే మరోపక్క తన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

పవన్ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో జరుగుతోంది. షూటింగ్ కు సంబంధించిన కొన్ని జాతర సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి అటు షూటింగ్ లో బిజీగా ఉంటూనే ఇటు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతూనే ఉన్నాడు మన రియల్ హీరో.