HomeTelugu Trendingవారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ కాదు ..అన్ స్టాపబుల్ ప్రోమో

వారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ కాదు ..అన్ స్టాపబుల్ ప్రోమో

Unstoppable new episode Pro
నందమూరి బాలకృష్ణ తన ఎడమచేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో అన్ స్టాపబుల్ టాక్ షో రెండు వారాలకే కనిపించకుండా పోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా బాలయ్య చేతికి కట్టుతోనే ఉన్నాడు. అయినా కూడా ఇప్పటికే ఆలస్యం అయ్యిందనే ఉద్దేశ్యంతో మూడవ ఎపిసోడ్ కు సిద్దం అయ్యాడు. మూడోవ ఎపిసోడ్ ను బ్రహ్మానందంతో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాని మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేశారు.

ఈ ప్రోమోలో బాలయ్య చేతి కట్టుతో ఎంట్రీ ఇచ్చారు. ఎంతో మంది ఫోన్ కాల్స్.. ఆరోగ్యం ఎలా ఉందని కాదు మూడవ ఎపిసోడ్ ఎప్పుడని.. మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. వారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ ను కాదు సెలబ్రేషన్ అంటూ బాలయ్య మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ఇంట్రో ఇచ్చాడు.

ఆహా టాక్ షో లో బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ నుంచి వచ్చిన రెండు ఎపిసోడ్స్ మంచి స్పందన దక్కించుకున్నాయి. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు కనిపించగా.. రెండవ ఎపిసోడ్ లో నాని సందడి చేశాడు. మొత్తానికి రెండు ఎపిసోడ్ లో కూడా బాలయ్య తన ఎనర్జీతో కుమ్మేశాడు.

ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. డిసెంబర్ 2 రాబోతున్న అఖండ సినిమా లో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!