‘జయలలిత’కు తలైవి నివాళి

తమిళనాడు దివంగత సీఎం, తమిళ ప్రజలంతా ముద్దుగా అమ్మ అని పిలుచుకునే జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం “తలైవి”. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ విడుదల చేయగా.. కొందరు ప్రశంసలు కురిపిస్తే.. మరికొంతమంది మాత్రం.. జయలలిత పాత్రకు కంగనా రనౌత్ సూటబుల్ కాదనే విమర్శలు వచ్చాయి. అయితే.. జయలలిత వర్ధంతి సందర్భంగా “తలైవి” సెట్‌లో చిత్ర యూనిట్.. జయలలిత చిత్ర పటానికి నివాళులర్పించింది.. అమ్మ చిత్ర పటం దగ్గర పుష్పాలు ఉంచి నివాళులర్పించారు కంగనా.. ఇక, తలైవి సెట్‌లో జయలలిత వర్ధంతి సందర్భంగా కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు.