HomeTelugu Trendingపుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఎమోషనల్‌

పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఎమోషనల్‌

Upasana emotional post
రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. లాస్ ఏంజెల్స్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీసమేతంగా ప్రదానోత్సవానికి వెళ్లారు. నాటునాటు పాటకు అవార్డు దక్కడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని తెలియజేశారు.

ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు లభించడం, ఈ చారిత్రక సందర్భంలో కడుపులో బిడ్డ సహా తాను పాలు పంచుకోవడంపై ఆమె స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్ కుటుంబంలో నేనూ భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించే విజయం. ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసిన రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ (పుట్టబోయే బిడ్డ) కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఉద్వేగంగా కూడా ఉంది’ అని ఉపాసన ట్వీట్ చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చిత్ర బృందంతో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు.
https://www.instagram.com/p/CnQ8uJauwMB/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!