‘దీప్‌వీర్‌’ పెళ్లి ఫొటోలు వైరల్‌.. శుభాకాంక్షల వెల్లువ

బాలీవుడ్ ప్రముఖ నటులు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటలీలోని లేక్‌ కోమోలో వీరి వివాహం కొంకణి, సింధి సంప్రదాయాల్లో అట్టహాసంగా జరిగింది. గురువారం పెళ్లి వేడుక సమయంలో తీసిన ఫొటోలను రణ్‌వీర్‌, దీపిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసి అభిమానులను, సినీ ప్రముఖులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ ఫోటోలకు బాలీవుడ్ సెలబ్రిటీలు, మొదలు సాధారణ ఫ్యాన్స్ వరకు అంతా ఫిదా అయిపోయారు. లైకులు, షేర్లు, కామెంట్లు, రీట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా ‘దీప్‌వీర్‌’ జంటకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు మూడు రోజుల నుంచి ట్విటర్‌లో ‘దీప్‌వీర్‌ కీ షాదీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

– అనుష్క శర్మ ‘మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఈ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ మున్ముందు మరింత బలపడాలని కోరుకుంటున్నాను. ‘మ్యారీడ్‌ క్లబ్‌’ కు స్వాగతం’

– ప్రియాంక చోప్రా ‘ఎంత అందంగా ఉన్నారో..’

– కత్రినా కైఫ్‌ ‘కంగ్రాట్స్‌ దీపిక, రణ్‌వీర్‌..’

– సోనమ్‌ కపూర్ ‘శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’

– ఫరా ఖాన్‌, బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ‘ఇద్దరు వ్యక్తులు పెళ్లిచేసుకునేటప్పుడు ఇంత సంతోషంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. గాడ్‌ బ్లెస్‌ యూ’

– శిల్పా శెట్టి ‘కంగ్రాట్స్‌. మీ ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. ఎవరి కళ్లూ మీమీద పడకూడదు’

– కరణ్‌ జోహార్‌ ‘మీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ, సంతోషం చిరకాలం ఇలాగే ఉండాలి. మీ ఇద్దరి ఫొటోలు చాలా ముద్దుగా ఉన్నాయి.’

– ప్రీతి జింతా ‘కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన దీపిక, రణ్‌వీర్‌కు శుభాకాంక్షలు. మ్యారీడ్‌ క్లబ్‌కు స్వాగతం.