HomeTelugu Trendingచిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది: ఉపాసన ట్వీట్‌

చిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది: ఉపాసన ట్వీట్‌

7 7
టాలీవుడ్‌లో ఉపాసనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రామ్ చరణ్ భార్యగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటూ.. అప్ డేట్స్ పోస్ట్ చేస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఉపాసన.. సమాజంలో జరిగే విషయాలపై కూడా చాలా యాక్టివ్‌గా స్పందిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. దేశమంతా మాట్లాడుకునేలా చేసిన వెటర్నరీ డాక్టర్‌పై దిశ అత్యాచారం హత్య ఘటనతో దేశమంతా మనవైపు చూస్తుంది. ఈ షాద్‌నగర్ లైంగికదాడిపై అంతా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న ఉపాసన కూడా తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ వీడియోను విడదల చేసింది.

ఇక ఇప్పుడు తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి స్పందనను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మావయ్య పంపిన మెసేజ్ చూసిన తర్వాత.. ఆయన రియాక్షన్ గురించి చదివిన తర్వాత మెగా ఇంటి కోడలు అయినందుకు గర్వంగా ఉందంటూ చిరంజీవి తనకు పంపిన సందేశాన్ని పోస్ట్ చేసింది ఈ మెగా కోడలు. ఇది చూసి అభిమానులు కూడా హర్షిస్తున్నారు. ఈ నలుగురు నిందితులకు పడిన శిక్ష చూసి కామంతో కళ్లు మూసుకుపోయి నేరాలు ఘోరాలు చేసే వాళ్లకు కనువిప్పు కలగాల్సిందే అంటూ స్పందించాడు చిరు. ఈ మెసేజ్ కోడలే పోస్ట్ చేసింది. మొత్తానికి చిరు స్పందన కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!