HomeTelugu NewsUpcoming Telugu Sequels 2024: క్యూ కడుతున్న చిన్న సినిమాల సీక్వెల్స్‌

Upcoming Telugu Sequels 2024: క్యూ కడుతున్న చిన్న సినిమాల సీక్వెల్స్‌

Upcoming Telugu Sequels 2024

Upcoming Telugu Sequels 2024: చిన్న సినిమాలుగా విడుదలై సూపర్‌ హిట్‌ అందుకుంటున్నాయి. టాలీవుడ్‌లో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లూ కూడా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సిద్ధూ కెరీయర్‌ల్లో ఓ మైల్‌ స్టోన్‌గా నిలిచింది. యూత్‌లో మంచి క్రేజ్‌ని క్రియేట్‌ చేసింది. ఇక ఇటీవలే విడుదలైన ఈ మూవీ సీక్వెల్‌ ‘టిల్లూ స్క్వేర్’ కూడా బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. ఇంకా ఈ మూవీ హవా నడుస్తునే ఉంది.

ఈ క్రమంలో మరో రెండు చిన్న సినిమా సీక్వెల్స్‌ కూడా తెర మీదకు వచ్చింది. మ్యాడ్ సీక్వెల్ ను మ్యాడ్ స్క్వేర్ గా తీసుకొస్తున్నారు. ఇప్పుడీ మూవీ మేకర్సే తమ మరో హిట్ సినిమా మ్యాడ్ సీక్వెల్ తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ పెట్టడం విశేషం. గతేడాది రిలీజైన మ్యాడ్ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

టిల్లూ స్క్వేర్ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ మూవీ మేకర్స్ సితార ఎంటర్‌టైన్మెంట్స్. ఇప్పుడదే ఊపులో మరో సినిమా సీక్వెల్ అనౌన్స్ చేశారు. టైటిల్ కలిసి రావడంతో ఈ కొత్త సీక్వెల్ కు కూడా మ్యాడ్ స్క్వేర్ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. గతేడాది అక్టోబర్ లో రిలీజైన మ్యాడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

టిల్లూ స్క్వేర్ లాగే మ్యాడ్ స్క్వేర్ కూడా మ్యాజిక్ చేస్తుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. నిజానికి డీజే టిల్లూ రిలీజైన రెండేళ్లకు టిల్లూ స్క్వేర్ వచ్చింది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే టిల్లూ గాడు ఈసారి కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి రూ.130 కోట్ల వరకూ వసూలు చేశాడు.

Upcoming Telugu Sequels 2024 ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ ప్రేమలు. నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. తెలుగులోనూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు సినిమా ఈ ఏడాది ఏకంగా రూ.135 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులోనూ రూ.15 కోట్లకుపైగా వచ్చాయి. దీంతో మూవీ సీక్వెల్ తీయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రేమలు 2 పేరుతో ఈ సినిమా రానుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

సీక్వెల్ కు కూడా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించనున్నాడు. తమ క్యూట్ లవ్ స్టోరీతో మరోసారి అలరించడానికి నస్లెన్, మమితా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో మమితా బైజుకి టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. ఈ రెండు సినిమాలు సీక్వెల్స్‌ కూడా ఫస్ట్‌ పార్టు కంటే ఇంకా మంచి విజయం సాధిస్తాయి అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!