
Urvashi Rautela outfit cost at Cannes 2025:
బాలీవుడ్ గ్లామర్ డివా ఉర్వశి రౌటేలా తన స్టన్నింగ్ రెడ్ కార్పెట్ లుక్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు ఆమె కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ధరించిన గౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ గౌన్ ధరను వింటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే – రూ. 1,294.20 కోట్లు!
6 నెలల కష్టం – 7 గంటల ప్రిపరేషన్
ఉర్వశి ధరించిన ఈ ప్రత్యేక డిజైన్ గౌన్‌ను ప్రముఖ డిజైనర్ మైకేల్ సింకో ప్రత్యేకంగా తయారుచేశారు. మెక్సికన్ ఆర్ట్ మోటిఫ్స్ ఆధారంగా మోజాయిక్ స్టైల్‌లో రూపొందించిన ఈ గౌన్‌ను తయారుచేయడానికి 6 నెలల సమయం పట్టింది. ఉర్వశి ఈ గౌన్‌ను ఫైనల్ చేసేందుకు 7 గంటలపాటు స్వయంగా టైం ఖర్చు చేసింది.
ఇంత ఖరీదైన లుక్ ఎప్పుడూ చూడలేదు!
ఉర్వశి కాన్స్2025 లుక్ మొత్తం ఖర్చు ఇలా breakdown చేయవచ్చు:
గౌన్: రూ.40.19 కోట్లు
జ్యూవెలరీ: అత్యంత అరుదైన డైమండ్లు – మౌస్సైఫ్ రెడ్, ఓప్పెన్‌హైమర్ బ్లూ, డ్రెస్డెన్ గ్రీన్, టిఫనీ యెలో వంటి రత్నాల విలువ – రూ. 1,250 కోట్లు పైగా
క్లచ్ బ్యాగ్: జ్యుడిత్ లీబర్ రెడ్ డైమండ్ స్టడెడ్ స్కార్లెట్ పెరట్ క్లచ్ – రూ.6 లక్షలు
ఈ లుక్ విలువ కిమ్ కర్దాషియన్ 2022 మెట్ గాలాలో ధరించిన మర్లిన్ మన్రో డ్రెస్‌కి మించి ఉందని అంటున్నారు!
ప్రస్తుతం ఉర్వశి పలు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది:
*కసూర్ (ఆఫ్తాబ్ శివదాసాని, జస్సీ గిల్‌తో)
*వెల్‌కమ్ 3, బాప్ (సన్నీ డియోల్, సంజయ్ దత్‌తో)
*ఇన్స్పెక్టర్ అవినాష్ 2 (రندیప్ హుడాతో)
*అంతేకాదు, జేసన్ డెరులోతో మ్యూజిక్ వీడియో కూడా ప్లాన్‌లో ఉంది!