HomeTelugu Trending'వాల్తేరు వీరయ్య'లో బాలీవుడ్‌ బ్యూటీ!

‘వాల్తేరు వీరయ్య’లో బాలీవుడ్‌ బ్యూటీ!

urvashi rautela with chiran

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మెగా 154 గా వస్తున్న ఈ చిత్రాన్ని బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్‌ టీజర్‌ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. కాగా ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి వైరల్‌ అవుతుంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ‘వాల్తేరు వీరయ్య’తో కలిసి చిందులేయబోతుందట. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ మీద వచ్చే స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి రౌటేలా డ్యాన్స్‌ చేయబోతున్నట్టు టాక్‌. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ర‌వితేజ కీలక పాత్రలో వస్తున్న ఈ సినిమాలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై వస్తోన్న ఈ చిత్రంలో శృతిహాస‌న్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా బోయపాటి-రామ్‌ సినిమాలో ఐటంసాంగ్‌లో మెరవబోతున్నట్టు ఇప్పటికే ఓ అప్‌డేట్ వచ్చింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu