కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్‌ బహిరంగ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 15న తీసుకొచ్చిన పంచాయతీ రాజ్‌ ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ గణన చేసి ఏ,బి,సి,డి కేటగిరీల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. ఇటీవల తొలగించిన ఓటర్ల పేర్లు తిరిగి నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు.